![]() |
![]() |
.webp)
"గజాలకు మీకు ఏదో ప్రాబ్లమ్ అయ్యిందని గొడవ అయ్యిందని చాలా వార్తలు బయటకు వచ్చాయి.నిజంగా అలా అనుకున్నారు మన వాళ్ళు " అని హోస్ట్ వర్ష అడిగింది. "నిజంగానా నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకు ఎవరితో గొడవ పెట్టుకోవడం నచ్చదు. నాకు ఈగో లేదు. జనాలకు ఇద్దరు అమ్మాయిలూ కొట్టుకుంటున్నారు అని న్యూస్ పెడితే వాళ్లకు నచ్చుద్ది కదా. ఇదంతా నాకు తెలీదు. ఇదేమన్నా మార్కెటింగ్ గిమ్మిక్కేమో నాకు తెలీదు. నాకు ఏ ప్రాబ్లెమ్ లేదు..నాకు ఎవ్వరితో ఏ ప్రోబ్లం లేదు." అని చెప్పింది ఆనందం రేఖ. "అలాగే వయసు గురించి చెప్పారు. మేల్ డామినేషన్ ఎక్కువ ఇక్కడ. ఒక వయసు వస్తే అమ్మాయిలూ ఆంటీ , అమ్మా ఐపోతారు పచ్చిగా చెప్పాలంటే ముసల్ది అనేస్తారు. కానీ అబ్బాయిలు ఎంత వయసొచ్చిన గ్లామర్ రోల్స్ చేస్తారు. అందరికీ వయసు పెరుగుతూనే ఉంటుంది. ఒకే ఏజ్ లో ఉంటె మీరు సచ్చిపోయారని అర్ధం. నేను సక్సెస్ చూసి స్ట్రగుల్ అయ్యాను అమితాబచ్చన్ కూడా అంతే కేబిసి షో ముందర ఆయన కూడా ఎన్నో స్ట్రగుల్స్ చూసారు. నేను ఫస్ట్ కాదు నేను లాస్ట్ కాదు ఇది చాలామంది విషయంలో జరుగుతుంది." అన్నారు. ఇక రేఖ ఇండస్ట్రీలో తన ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. "ఒక వెస్ట్రన్ వేర్ యాడ్ లో చేస్తే ఆ పోస్టర్ ని షో రూమ్ లో పెట్టారు.
"చిత్రం మూవీ డైరెక్టర్ తేజ గారు చూసి ఆ మూవీ కన్నడలో నాకు అవకాశం ఇచ్చారు. అప్పటికి నాకు నటించాలన్న కోరిక లేదు. మిస్ ఇండియాకి ట్రై చేయాలనుకుంటున్న ఆ టైములో. ఐతే అప్పుడే నాకు 2 మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఒకటి చిత్రం మూవీ రీమేక్. విక్రమ్ గారు నటించిన తమిళ్ సేతు దాని రీమేక్ గుచ్చా అని సుదీప్ గారితో. ఎలాంటి ప్లానింగ్ లేకుండా రెండు మూవీస్ కి సైన్ చేసేసా." అని చెప్పారు. "ఆనందం మూవీ షూటింగ్ మెమోరీస్ ఏమన్నా చెప్పండి" అని హోస్ట్ అడిగేసరికి "ఆ మూవీ ఉదయ్ కిరణ్ గారు చేయాల్సి ఉంది. లుక్ టెస్ట్ టైములో ఉదయ్ కిరణ్ గారిని డైరెక్టర్ టీమ్ అందరం కలిసి పికప్ చేసుకుని ఫిలిం సిటీకి వచ్చాము. ఏమయ్యిందో తెలీదు కానీ డెస్టినీ అంటారు కదా అలా ఆ అవకాశం ఆకాష్ గారికి వెళ్ళింది. ఉదయ్ కిరణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది అని అడిగింది వర్ష. "అదేంటో అర్ధం కాదు నాకు. ఉదయ్ కిరణ్ గారితో రెండు మూడు సార్లు మూవీస్ చేస్తూ చేస్తూ మిస్సయ్యాయి. కలుసుకోవాలని మూవీలో గజాల ప్లేస్ లో నేను చేయాల్సింది. దీనికి ముందు కన్నడ మూవీ చేస్తూ ఉంటే డేట్స్ క్లాష్ అయిపోయి వాళ్ళు వెయిట్ చేయలేక నన్ను తీసేసారు. నాకు ఉదయ్ కిరణ్ గారితో పరిచయం లేదు. ఇండస్ట్రీలో కూడా ఎలాంటి కనెక్షన్స్ లేవు " అని చెప్పారు.
![]() |
![]() |